“విభూతి ఎవరికి ? ” రచయిత్రి : శ్రీమతి కందేపు లక్ష్మి ,లాం గ్రామం ,గుంటూరు జిల్లా వారి కలంనుండి జాలువారిన చిన్నకథ

మా అక్కగారి అమ్మాయి ఓణీల ఫన్క్షన్ కి మేం నలుగురం అక్కాచెలెళ్ళo,మా పిల్లలు ఆరుగురు మొత్తం పదిమందిమి రేపల్లేదగ్గర చాట్రగడ్డకు వెళ్ళాము. అక్కయ్యని మేనమామకు ఇచ్చారు. ఆయన డ్రాయింగ్ టీచర్. కాలువ ప్రక్కనే వాళ్ళయిల్లు కొబ్బరి చెట్లు,ఆలయాలు చక్కగా,చల్లగా వుంది ఊరు.

ఫంక్షన్ కి చాలదని అక్కగారింటి ఓనరుగారు తమ ఇళ్లును కూడా విడిదికి ఇచ్చారు. మేము ఒకరోజు ముందే వెళ్ళాం మా చెల్లి తన పిల్లలoదరికీ స్నానాలు చేయించి తల్లి,పిల్లాడు  కెవ్వు,కెవ్వున అరుస్తూ,ఏడుస్తూ  విడిది ఇంట్లోకి వచ్చారు.అక్కడున్న అక్కకూతురు,చిన్నచెల్లివాళ్ళు కూడా పెద్దగా ఏడవటం మొదలు పెట్టారు. నేను ఏమైందీ అని అడిగేలోపు మా అక్క,మామయ్యా పరిగెత్తుకుంటూ వచ్చి అదే ప్రశ్న వేశారు.ఓనరు గారి బొచ్చు కుక్కపిల్ల మావాడిని కరవబోయిందని చెప్పింది మాచెల్లి ‘మీరు ఎందుకు ఏడ్చారని పిల్లల్ని అడిగితే  ‘పిన్ని అంతలా ఏడిస్తే ఏంజరిగిందో తెలియక భయపడి ఏడ్చామ్’ అన్నారు .ఇదా సంగతి? ‘ సోని ‘  కరవదు ఊరికే వెంటపడుతుంది  అని చెప్పింది అక్క.’నాకేం తెలుసు కరుస్తుందని భయపడ్డా నంది’ చెల్లి. యింత గోలకి మాస్టారిగారి ఇంట్లో ఏమయిందోనని ఇరుగు ,పొరుగు వాళ్ళు వచ్చారు. ఇంతలో మామయ్యా అన్నాడు’ పిలవండి విభూతి పెడతాను ‘   అని ‘ఎంతమందిలో ఎవరికి పెట్టాలి విభూతీ?’ అంటే ” సోనీకి ” బుజ్జిపిల్ల మనుషుల్నిచూసి ఎంత దడిచిందో ఇప్పట్లో బయటకు రాదు. అన్నారు. దాంతో ఒకటేనవ్వులు. రేపటి ఫంక్షన్ కళ ఇప్పుడే వచ్చేసింది అన్నారు ఇరుగు పొరుగు. మా చెల్లి ముఖం కందగడ్డలా అయిందిని వేరేచెప్పాలా !

( సాక్షి ఫండే ఆక్టోబరు 05,2014 న ప్రచురించిన చిన్న కథ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *